Home ప్రకాశం రాజకీయాల్లో బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : తాడివలస దేవరాజు

రాజకీయాల్లో బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : తాడివలస దేవరాజు

327
0

చీరాల : గడియార స్తంభం సెంటర్లో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు కొల్లిపర వెంకట్ అధ్యక్షతన బిసి మండల్ కు ఘన నివాళి తెలిపారు. ముందుగా మహాత్మా పూలే విగ్రహానికి పూల దండ వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం మండల్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ బీసీలు దేశంలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ చట్టసభల్లో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. రాజకీయాల్లో బిసిలకు చట్టబద్ధత లేదన్నారు. బిసిలకు రాజకీయ రిజర్వేషన్ బిల్లును చేసేంతవరకూ బీసీ లందరూ ఐక్యత పోరాడవలసిన అవసరం ఉందన్నారు.

కొల్లిపర వెంకటేష్ మాట్లాడుతూ ఓబిసి రిజర్వేషన్లు అమలు కోసం 1990 ఆగస్ట్ 7న అప్పటి ప్రధాని విపి సింగ్ పార్లమెంట్ లో మండల్ కమీషన్ అమలును ప్రకటించారని గుర్తు చేశారు. ఆధిపత్య కుల పార్టీలకు బిసిలమీద ఉన్న ప్రేమను ఇప్పటికైనా ప్రతి బిసి గ్రహించాలన్నారు. మండల్, పూలే స్పూర్తితో బిసిల హక్కుల కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బిసి నాయకులు యనమల యానాదిరావు, వల్లెపు వేణు, వెలగపూడి రామకృష్ణ, గుంటి విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.