చీరాల : అఖిలభారత బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ విస్తృతస్థాయి నిర్వహించారు. బీసీల ఐక్యతపై చర్చించారు. బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం బీసీల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పోతుల సునీత, అఖిల భారత బీసీ సంఘం ప్రతినిధులు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ నామినేషన్ పదవులకు ఎంపికైన బిసి ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి, తాడివలస దేవరాజు పాల్గొన్నారు.