చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి శివాలయంలో బట్ట మోహనరావు, పుష్పవల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వైసిపి యువనేత కరణం వెంకటేష్‌బాబు ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు, అనాధలకు, వికలాంగులకు ప్రతి మంగళ, శనివారాల్లో భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నారు. మోహనరావు దంపతుల స్పూర్తితో మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
రాష్ట్ర చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. పాతచీరాలలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ట్రస్టు తరపున పుష్పవల్లి, మోహనరావు దంపతులు రూ.20వేల చెక్కును వెంకటేష్ చేతులమీదుగా అందజేశారు.
ఈసందర్భంగా దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్రను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి చల్లా జనార్ధనరావు, రిటైర్డు డిఎస్‌పి కట్టా రాజ్‌వినయ్‌కుమార్, గోరంట్ల సుధారాణి, ట్రస్ట్ ఛైర్మన్ బట్ట మోహనరావు, విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజి రిటైర్డు ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య, దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కూర్మా రాహుల్జీ పాల్గొన్నారు.