అద్దంకి (Addanki) : పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. కానీ అనధికారికంగా రెస్టారెంట్లు మందు విక్రయిస్తుండటంతో బారుకు వెళ్లేవారు లేరు. తాము బార్ నడపలేమని అనుమతి పొందిన దుకాణం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారులు కొద్ది రోజుల క్రితం రెస్టారెంట్లో మందు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలతో గత 15 రోజులు తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి మరల రెస్టారెంట్లలో ముందు అమ్మకాలు జరపడంతో బార్ నిర్వాహకులకు కష్టతరంగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్య చెప్పుకున్నా పరిష్కారం కాకపోవడంతో తము నడపలేమని ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటాం : ఎక్సైజ్ సీఐ భవాని
బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ కష్టంగా మారిందని నిర్వాహకులు బార్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే విషయంపై ఎక్సైజ్ సిఐ భవానిని వివరణ కోరగా తిరోజు పట్టణంలో రెస్టారెంట్లు వద్ద కానిస్టేబుల్ గస్తీ తిరుగుతున్నారని, తమ కృషి తాము చేస్తున్నామని తెలిపారు. అనుమత్తుల్లేని రెస్టారెంట్లలో ముందు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.






