Home బాపట్ల బాపట్ల పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

బాపట్ల పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

40
0

బాపట్ల (DN5 News) : కొత్తకంకటపాలెం జిబిసి రోడ్డులోని డెఫ్ అండ్‌ డం స్కూల్ ప్రక్కన తెలుగుదేశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ నూతన కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన అనంతరం బాపట్ల పార్లమెంట్ నూతన కమిటీ ప్రామాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శులు బావుడా ఛైర్మన్‌ సలగల రాజశేఖరబాబు, రాఘవ, ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కార్యక్రమంలో టిడిపి (Telugudesham) పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ, 3వ జోన్ ఇన్‌ఛార్జ్ వేపాటి చిరంజీవిరావు, బాపట్ల, చీరాల, పర్చూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ రాజు, మద్దులూరి మాల కొండయ్య, ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని విజయవంతం చేశారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు.