బాపట్ల : ఎమ్మెల్యే నరేంద్రవర్మ తన నివాసంలో కర్లపాలెం మండలంలో అర్హులైన 5 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది నుండి మంజూరైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నక్కల గోపిచంద్ కు రూ.3,24,082, మల్లారపు వాసుదేవరావుకు రూ.1,38,243, పేరలి గ్రామానికి చెందిన దబ్బకూటి నాగయ్యకు రూ.60వేలు, గణపవరం గ్రామానికి చెందిన గూడూరి శేషగిరిరావుకు రూ.50,524, కర్లపాలెం గ్రామానికి చెందిన షేక్ జమిల్లా బేగంకు రూ.47,567 విలువైన చెక్కులు అందజేశారు.