Home బాపట్ల ప్రజా సమస్యలే ప్రాధాన్యమన్న వేగేశన నరేంద్ర వర్మ

ప్రజా సమస్యలే ప్రాధాన్యమన్న వేగేశన నరేంద్ర వర్మ

99
0

బాపట్ల : ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ది తనకు ప్రాధాన్యమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. పట్టణంలోని 1వ వార్డులో ఆయన బుధవారం పర్యటించారు. ప్రజల దైనందిన సమస్యలను నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, పంపిణీ వేగంగా చేపట్టాలని సూచించారు. మురుగు నీటి కాలువలు నిండిపోయి ప్రవహించని ప్రాంతాల్లో తక్షణం శుభ్రపరిచే పనులు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పారుదల లేకుంటే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు.

పక్షవాతంతో బాధపడుతున్న గునివిని గోపాలకృష్ణరెడ్డిని పరామర్శించి వేగేశన ఫౌండేషన్ ద్వారా రూ.10వేల ఆర్థిక సాహాయం చేశారు. వారికి పెన్షన్ ఇప్పించాలని అధికారుకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డిఇ కృష్ణారెడ్డి, ఎఎంసి చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రెయ, సోమాల ప్రసాద్, బీరం మరియమ్మ, చెన్నుపాటి హైమావతి, రమాదేవి, నజ్మ పాల్గొన్నారు.