బాపట్ల (Bapatla) : కలెక్టర్ కార్యాలయంలో సింగపూర్ (Singapore) బృందంతో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Vinod Kumar IAS) మంగళవారం సమావేశం అయ్యారు. జిల్లా భౌగోళిక అంశాలను సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. బాపట్ల జిల్లాకు ఉన్న అపారమైన భూ వనరులు, తీరప్రాంతం పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమని చెప్పారు. సింగపూర్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.






