విజయవాడ : ప్రతిఒక్కరు అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తే గుర్తింపు వస్తుందని మధర్ థెరిస్సా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎ కృష్ణమూర్తి పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు గురుబ్ర్మహ్మ అవార్డులతో సన్మానించారు. జ్ఞాపిక, షాలువ, బంగారు మెడల్‌తో సన్మానించారు. బాపట్ల మండలం ఆసోదివారిపాలెం ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యాతం సౌజన్య మాట్లాడుతూ తనకు రాష్ట్రస్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్థ డైరెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.