Home ప్రకాశం టంగుటూరులో బాలినేనికి ఘనసన్మానం

టంగుటూరులో బాలినేనికి ఘనసన్మానం

623
0

టంగుటూరు (దమ్ము) : కొండపి రోడ్డులో సోమవారం జరిగిన మౌర్య మెడికల్స్ ప్రారంబోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు.

అనంతరం కొండపి రోడ్డులోని నాయకులు సూదనగుంట నారాయణ కంపెనీ వద్దకు విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, వైసీపీ సీనియర్ నాయకులు సూదనగుంట నారాయణ, యువజన నాయకులు సోమేపల్లి మురళీకృష్ణ, ఓబీసీ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, నాగేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ గొల్లపూడి సునీత, మెంబర్ గుడవర్తి కిషోర్ కుమార్, దుగ్గిరాల పేర్రాజు తదితరులు పాల్గొన్నారు.