Home సినిమా మరో ఊరమాస్ అవతారంలో బాలయ్య..!

మరో ఊరమాస్ అవతారంలో బాలయ్య..!

375
0

ఇప్పటికే ఎన్నో మాస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను రంజింప చేశాడు నందమూరి బాలకృష్ణ. అందులో భాగంగా ఆయా సినిమాల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా కూడా నిలిచాయి. అలాంటి బాలయ్యను మరో ఊరమాస్ అవతారంలో చూపిస్తానంటున్నాడు దర్శకుడు, నటుడు రవిబాబు. ‘అల్లరి’ ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘అవును’ వంటి భిన్న చిత్రాలతో రవిబాబు దర్శకుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘ఆవిరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవి. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి కూడా. ఈ సందర్భంగా ఓ టాక్ షోలో మాట్లాడిన ఆయన బాలకృష్ణ ఆమోదిస్తే ‘ఐరన్ మ్యాన్’గా చూపిస్తానంటున్నాడు.

బాలయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తనతో సినిమా ఎందుకు తీయవని బాలకృష్ణ గొడవ పడుతుంటారని అన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించారని చెప్పాడు. అయితే బాలకృష్ణతో తను ఏ సినిమా చేసినా టైటిల్ మాత్రం ‘ఐరన్ మ్యాన్’ అనే పెడతానంటున్నాడు రవిబాబు. వీరి కాంబినేషన్ సినిమా సంగతి పక్కన పెడితే ‘ఐరన్ మ్యాన్’ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం బాలయ్య రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా మరొకొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. మరి బాలయ్య, రవిబాబు కలయికలో సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం.