ప్రకాశం : కనిగిరిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కనిగిరి మండలం చాకిరాల ఎస్సీ పాలానికి చెందిన గూడూరి ప్రమీలమ్మకు మంగళవారం సాయంకాలం పుట్టినొప్పుడు రావడంతో భర్త గూడుని రమేష్ హుటాహుటిన సాయి కృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. మొదటి కాన్పు కావడంతో డాక్టర్ బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ చేయాలని చెప్పడంతో సరే అన్నారు. అయితే ఆపరేషన్ సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఈ తెల్లవారుజామున చనిపోయారు.
తల్లి, బిడ్డ మరణ వార్త విన్న భర్త రమేష్ బంధువులందరూ హాస్పటల్ ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణమంటూ హాస్పటల్ వద్ద కారు ధ్వంసం చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.