Home బాపట్ల ప్లాస్టిక్‌ వ్యర్ధాల వస్తుమార్పిడిపై విద్యార్ధుల్లో చైతన్యం

ప్లాస్టిక్‌ వ్యర్ధాల వస్తుమార్పిడిపై విద్యార్ధుల్లో చైతన్యం

70
0

చీరాల : స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలు నందు గీతా యంగ్ సైంటిస్ట్ అండ్‌ రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన వస్తు మార్పిడి కార్యక్రమంలో పాత పుస్తకాలు, న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ వస్తువులు 1800 కెజీలు 130 మంది విద్యార్థుల దగ్గర సేకరించి, దానికి సమానమైన నూతన విద్యా సంవత్సరంకు ఉపయోగపడే రూ.21వేల విలువైన నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, స్కేల్స్, జామెంటరీ బాక్స్‌లు పంపిణీ చేశారు. 50కెజిలపైగా పాత పుస్తకాలు తెచ్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గీతా ట్రస్ట్‌ ఛైర్మన్‌ వలివేటి మురళీకృష్ణ, సిహెచ్‌ బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, గీతా సంస్థ కిరణ్, పద్మ, సుధ, నవీన, రీఫాత్, బాజీ, గుర్రం రాఘవరావు, జాలాది కృష్ణ, డాక్టర్‌ ఐ బాబూరావు, చీరాల కృష్ణమూర్తి, చారగుళ్ళ గురుప్రసాద్, జివై ప్రసాద్, డివి సురేష్ పాల్గొన్నారు.