Athibala | మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అనేక ఔషధ మొక్కలను మనం ఇప్పటికే చూసి ఉంటాం. కానీ ఆ మొక్కల్లో ఔషధ గుణాలను కలిగి ఉంటాయని చాలా మందికి తెలియదు.
మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో అతిబల మొక్క ఒకటి. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు మనకు కనిపిస్తాయి. ఈ మొక్కకు ఉన్న అనేక ఔషధ గుణాలు తెలియని వాళ్లే ఎక్కువ మంది. వీటిని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇక అతిబల మొక్కనే ‘తుత్తురు బెండ’ అని ‘దువ్వెన బెండ’ అని కూడా పిలుస్తారు. సుమారుగా 5వేల ఏళ్ల నుంచే ఈ చెట్టును ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారని చరిత్ర చెబుతోంది. ఈ చెట్టుకు చెందిన భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
అనేక వ్యాధులకు ఔషధం..
అతిబల అంటే చాలా శక్తివంతమైనది, బలమైనదనే అర్థాలు వస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈ మొక్క అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ హైపర్ లిపిడెమిక్, అనాల్జెసిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ మలేరియల్, డై యురెటిక్, హైపో గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. జ్వరాన్ని తగ్గించేందుకు, నాడీ వ్యాధులకు, తలనొప్పి, కండరాల నొప్పులు, గాయాలు, పుండ్లు మానేందుకు, గుండె జబ్బులకు, తీవ్ర రక్త స్రావం అయ్యే సందర్భాల్లో, పక్షవాతం, కీళ్ల నొప్పులు, కుష్టు, కళ్లలో శుక్లాలు, నోట్లో అల్సర్లు, విరేచనాలు, కాళ్ల నొప్పులు, పాము కుట్టినప్పుడు, పైల్స్, గనేరియా, దగ్గు, ఆస్తమా, నపుంసకత్వం వంటి అనేక వ్యాధులకు అతిబల ఎంతగానో పనిచేస్తుంది. అతిబల వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు, విత్తనాలు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని భిన్న రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
పురుషుల ఆరోగ్యానికి..
అతిబల మొక్క భాగాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అనేక రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ రోగాలను తగ్గిస్తాయి. అతిబల చూర్ణాన్ని పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలపాలి. అందులోనే కాస్త తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తుంటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే పురుషులకు ఎంతో మేలు జరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. నపుం సకత్వం పోతుంది. అతిబల చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుంది. కొలెస్ట్రాల్, షుగర్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
లివర్‌కు మేలు..
అతిబలలో యాంటీ బైలియరీ, హెపాటో స్టిములేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి లివర్‌కు ఎంతో మేలు చేస్తాయి. కామెర్లు అయిన వారు అతిబలను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. లివర్ చాలా త్వరగా రికవరీ అవుతుంది. లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. అతిబల చూర్ణంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు, కాలి పిక్కలు పట్టుకుపోయే వారు అతిబలను తీసుకుంటే మేలు జరుగుతుంది. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. ఇలా అతిబలతో అనేక లాభాలు పొందవచ్చు. అయితే వైద్యుల పర్యవేక్షణలో అతిబలను వాడుకోవాలి. దీంతో ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చు.