టంగుటూరు (దమ్ము) : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణతో సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ సూచనల మేరకు ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కోరుకునే తెలుగుదేశం వాళ్ల మనసులు మార్చాలని దేవుడుని వేడుకుంటూ విజయాలకు నెలవైన విజయదశమి రోజున వైసీపీ కొండపి ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాలలోని గ్రామ దేవత అమ్మవారి గుడులలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టంగుటూరు : వైసిపి మండల అధ్యక్షులు సూదలగుంట శ్రీహరి బాబు, టంగుటూరు జడ్పీటీసీ మన్నం అరుణ కుమారి, వైసీపీ సీనియర్ నాయకులు బీనీడి ఉదయ్ కుమార్, శివాలయం దేవస్థానం ఛైర్మన్ గొల్లపూడి సునీత, యంపిటిసి కొమ్ము ప్రభుదాస్, రైతు సంఘం నాయకులు పమిడ వీరరాఘవయ్య, మాజీ యంపిటిసి శారీమందిర్ వెంకటేశ్వర్లు, సూదలగుంట వెంకటస్వామి, వెల్డన్ శ్రీనివాస్, ప్రకాశంజిల్లా వైసీపీ సోషల్ మీడియా మేదరమెట్ల భరత్ రెడ్డి, గుడవర్తి కిషోర్ రాజు, దుగ్గిరాల పేర్రాజు, కొమ్ము కోటేశ్వరరావు (బుజ్జి), గుంతోటి శ్రీనివాసరావు, పులిచర్ల కోటయ్య తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
కొండపి : కొండపి మండల కన్వీనర్ గోగినేని వెంకటేశ్వరరావు(G.V), కొండపి మండల వైస్ ఎంపీపీలు వేముల వెంకట ప్రసాద్, రావులపల్లి కోటరాజు, వైసీపీ సీనియర్ నాయకులు ఆరికట్ల కోటిలింగయ్య, పోటు శ్రీను, గొట్టిపాటి మురళి, పోకూరి కోటయ్య, కట్టవారిపాలెం రావెళ్ల రాజీవ్ &టీం, మామిళ్లపల్లి గోవిందుకృష్ణ మూర్తి, గుఱ్ఱప్పడియ కోటిరెడ్డి, మూగచింతల బత్తుల కోటు, పెరిదేపి మోపర్తి నారాయణ, ముప్పరాజుపాలెం సుబ్బయ్య, కోయవారిపాలెం వంకాయలపాటి వెంకయ్య, గుంటుపల్లి శ్రీను, వెంకట సుబ్బారావు, గోగినేనివారిపాలెం చింతల సుబ్బారావు, పొన్నం హరి, డీలర్ రమణయ్య, బుల్లయ్య, వెన్నూరు ప్రసాద్, సుధాకర్, పూనాటి శ్రీను, నెన్నూరుప్పాడు వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి, పెదకండ్లగుంట కొండయ్య వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
పొన్నలూరు : వైసిపి మండల అధ్యక్షులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, సర్పంచులు మన్నెం చిన వెంకటేశ్వర్లు, గుత్తి భాస్కర్, పిల్లి తిరుపతిరెడ్డి, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, పిల్లి మాల్యాద్రి, ఎం కాంతారావు, గోపిరెడ్డి, ఓబుల్ రెడ్డి, ముదివర్తి శివ, చుండి గణేష్, రాయిపాటి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి మండలాలలో ఆయా మండల నాయకులు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.