కొండపి : గత ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో ఏమీ లేని స్థితిలో అశోక్‌బాబు వచ్చి పార్టీని నిలబెట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పంచాయితీల్లో కార్యకర్తలను తయారు చేశారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానన్న బరోసా ఇచ్చారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది కొత్తవారిని తెరపైకి తీసుకొస్తే అంగీకరించేందిలేదు. అవసరమైతే అశోక్‌బాబును స్వతంత్ర అభ్యర్ధిగానైనా నిలిపి గెలిపించుకుంటాం. పార్టీ మొత్తం నియోజకవర్గంలో అశోక్‌బాబు వెంటే ఉన్నాం. ఉంటాం. ఎవరో వస్తారని కార్యకర్తలు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటూ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ప్రకటించారు. కొండేపి నియోజకవర్గంలో వరికూటి అశోక్‌బాబుకు ప్రత్యామ్నయంగా మరో వ్యక్తిని తెరపైకి తీసుకురావడంతో పార్టీ మండల, గ్రామస్థాయి నేతలంతా పార్టీ కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా అశోక్‌బాబు వెంటే ఉన్నట్లు ప్రకటించారు.