టంగుటూరు : నియోజకవర్గంలో అర్హులైన బుడబుక్కల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అశోక్ బాబు గ్రామ సచివాలయం వద్ద బైఠాయించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలో అర్హులకు చోటులేకుండా చేశారని ఆరోపించారు. జాబితాపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సచివాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్హులకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన అశోక్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్లో నిర్బంధించారు.
అరెస్టులకు నిరసనగా స్టేషన్లో అశోక్ బాబు దీక్షకు కూర్చున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల సమస్యపై గ్రామసభలో చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బయటి వ్యక్తులకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. తమ ఆందోళన వద్దకు బయటివారిని అనుమతించిన పోలీసులు తమను అరెస్ట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.