– ఒంగోలు, నెల్లూరు నగరాల్లో లేని అధునాతన సౌకర్యాలు
– పరికరాలు, ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్ ఏర్పాటు
– 24 గంటలు అందుబాటులో డాక్టర్స్ నిరంతర సేవలు
టంగుటూరు (DN5 న్యూస్) ఆగష్టు 29 : ప్రజలకు ఆషాలత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాణ్యమైన వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కురుగుంట్ల ఆషాలత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈఓ, మాజీ ఆదాయపు పన్నుల శాఖ అధికారి (IRS) కురుగుంట్ల సెల్వన్ రాజు అత్యాధునిక సదుపాయాలతో కొండపి రోడ్డులో ఏర్పాటు చేసిన ఆషలత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు.
ఈసందర్భంగా సత్య మాట్లాడుతూ ఒంగోలు, నెల్లూరు నగరాల్లో కూడా లేని అధునాతనమైన నూతన పరికరాలు, ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్‌ను గ్రామీణ ప్రాంతమైన టంగుటూరులో ఏర్పాటు చేయటం టంగుటూరు, కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, ఉలవపాడు ప్రాంతాల ప్రజలకు ఉపయోగ పడుతుందని అన్నారు. పేదలకు అన్ని వసతులతో వైద్యం చేయాలనే సంకల్పంతో అభివృద్ధి చెందుతున్న టంగుటూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో హాస్పిటల్ మరింతగా ప్రజల్లోకి చేరి పేదలకు కార్పోరేట్ వైద్యం అందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్నారు. ఈ ప్రాంతంలో పేదలు ఎక్కువగా ఉంటారని, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం గుర్తించి నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్య రక్షణకు భరోసా కల్పించాలన్నారు.
జనరల్ మరియు ల్యాప్రో స్కోపిక్ సర్జన్ డాక్టర్ కురుగుంట్ల సువర్ణరాజు మాట్లాడుతూ ఎటువంటి అత్యవసర సేవలైనా 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారన్నారు. ఆసుపత్రిలో నాలుగు విభాగాలు ఉన్నాయని, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, స్త్రీ ప్రసూతి, ఎముకల విభాగం ఉన్నాయన్నారు. ల్యాబ్ సౌకర్యం, ల్యాప్రోస్కోప్ ఆపరేషన్, హిస్ట్రెక్టమీ, డెలివరీ, డెలివరీకి సంబంధించిన ఆపరేషన్, తిత్తుల్లో రాళ్లు ఉన్నా, 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్, విరిగిన ఎముకల ఆపరేషన్, కీళ్ల మార్పిడి అత్యాధునిక యంత్రాలతో ఆపరేషన్, బీపీ, షుగర్, ఆస్మా, గుండెపోటు అత్యవసర సేవలతో వెంటిలేటర్ తో కూడిన ఐసీయూ, అన్ని అత్యవసర సేవల రూములలో ఆక్సీజన్ సేవలు ఉన్నాయన్నారు. ఆరు నెలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ, EHS సేవలు అందుబాటులోకి వస్తాయని, రెండు నెలల్లో ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త బెల్లం జయంత్ బాబు, ఉపాస హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ జి ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావల, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ ఏ శ్రీనివాసరావు, డాక్టర్ కె పవన్ కుమార్, డాక్టర్ కంచర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ కె కృష్ణారావు, రైతు నాయకులు పోతుల నరసింహరావు, AMC చైర్మన్ మక్కెన హరిబాబు, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు తన్నీరు లక్ష్మయ్య హాస్పిటల్ ప్రధాన ఓపి విభాగాన్ని, ఐసీయూ కన్సల్టెన్సీ క్యాబిన్లను, లామినార్ ఆపరేషన్ ప్రధాన థియేటర్ ను, ప్రసూతి విభాగాన్ని, ఫార్మసీ విభాగాన్ని, జనరల్ వార్డును వంటి పలు విభాగాలను ప్రారంభించారు. అనంతరం వచ్చిన ప్రజలందరికి ఉచిత ఓపి ద్వారా వైద్యం మందులు అందించారు.
కార్యక్రమంలో కురుగుంట్ల ఆషలత మెమోరియల్ పౌండేషన్ వ్యవస్థాపకులు కురుగుంట్ల స్నేహలత, ప్రసూతి, స్త్రీల నిపుణులు సీల ప్రణతి రాజ్, కీళ్ళ మరియు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కురుగుంట్ల మౌనిక, వైశ్య సంఘం నాయకులు నాగభూషణం, ఆదినారాయణ, సత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.