Home ప్రకాశం దేశవ్యాప్త సమ్మెలో కారంచేడు ఆశా కార్యకర్తలు

దేశవ్యాప్త సమ్మెలో కారంచేడు ఆశా కార్యకర్తలు

284
0

కారంచేడు : స్వర్ణ, కారంచేడు, దగ్గుబాడులో పని చేస్తున్న ఆశా కార్యకర్తలు సోమవారం జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ఆశాలను పర్మినెంట్ చేయాలని, సచివాలయంలోకి ఆశల బదలాయింపు ఆపాలని, మాస్కులు, గ్లోవ్స్, శానిటైజర్ అవసరమైన మేరకు ఇవ్వాలని, ఫ్రంట్లైన్ వర్కర్లుకు ఇస్తున్న రు.50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ఇప్పటికే మరణించిన ఆశలకు వర్తింప చేయాలని కోరారు.

కోవీడ్ బారినపడిన ఆశా వర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని కోరారు. ఆసుపత్రుల సంఖ్య సిబ్బందిని పెంచాలని, ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రు.10వేల వేతనం ఒకేసారి ఇవ్వాలని అన్నారు.

అందరికీ ఫోన్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్స్ తో నేడు సమ్మెలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. కార్యక్రమంలో బేబీ, సింగమ్మ, మరియమ్మ, సుబ్బరావమ్మ, బుజ్జి, సమాధానం, ఉష, అనూష, రాధిక, ఉమాదేవి, సిఐటియు కారంచేడు మండల ప్రధాన కార్యదర్శి బి శంకర్ పాల్గొన్నారు.