Home జాతీయం బిజెపి సంచలన నిర్ణయం : మూడు ముక్కలైన జమ్మూకాశ్మీర్

బిజెపి సంచలన నిర్ణయం : మూడు ముక్కలైన జమ్మూకాశ్మీర్

549
0

అమరావతి : కేంద్రంలోని బిజెపి సారాధ్య ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రధాని అయ్యాక నోట్ల రద్దు, జిఎస్టీ వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ కు ఉన్న 370ఆర్టికల్ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అందరూ ఊహించినట్లే జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. బిల్లుకు 4సవరణలు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ప్రతిఘటన, అభ్యంతరాల మధ్యే అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొద్దిక్షణాల్లోనే అధికారపక్షం లాంఛనాలనూ పూర్తిచేసింది. రాజ్యసభలో ప్రకటన వెలువడిన కొద్దీ నిమిషాలకే దానికి రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్‌ విడుదల చేసారు. దీంతో జమ్మూకాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవటంతోపాటు మూడు ముక్కలైంది. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ శాసనసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంకాగా లడక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లభించనున్నాయి. కాశ్మీర్ సరిహద్దుల మార్పుతో పాటు ఎమర్జెన్సీ విధించే అధికారాలు కేంద్రానికి ఉంటాయి.

ఇప్పుడు పార్లమెంటులో చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలవుంటుంది. ఆర్టికల్ 370 రద్దుపై పదిరోజుల నుంచి కేంద్రం పావులు కదిపింది. ఎట్టకేలకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పని పూర్తి చేసింది.