వేటపాలెం : ఆమె పేరు సీత. ఆ పేరు అంటే తెలియని వాళ్లు ఉండరు. అలాంటి పవిత్రమైన పేరు పెట్టుకుని చేస్తున్న పనులు చూస్తే… అంత అసహ్యమేస్తుంది. అదేంటంటారా? అదే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుని కన్న బిడ్డలను ఇంటి నుండి గెంటేసింది. గెంటేయడమే కాదు తన ఇద్దరు కూతుర్లు తనను వేధిస్తుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అసలు విషయం ఏంటి? వివాహేతర సంబంధం పెట్టుకున్న సుబ్బారావు అనే వ్యక్తితో కలిసి ఇద్దరు కూతుర్లను వేదిస్తుందని వారం రోజుల క్రితం ఇద్దరు కూతుర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల సమక్షంలో సర్ది చెప్పారు. కానీ సరిగ్గా శ్రీరామనవమి రోజే ఇద్దరు కూతుర్లను ఇంటి నుండి గెంటేసింది. ఇంటిలోని వస్తువులన్నీ తాను సంపాదించినవేనని చెప్పి కనీసం కట్టుకునేందుకు బట్టలు ఇవ్వలేదు. కప్పుకునేందుకు దుప్పటి ఇవ్వలేదు. చేసేదేమీలేక ఆ ఇద్దరు కూతుర్లు ప్రసన్న, వెంకటలక్ష్మి మళ్లీ పోలీసులను ఆశ్రయించారు.
వేటపాలెం మండలం సర్వోదయ కాలనీకి చెందిన సీత భర్త 15ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. పెద్దకూతురు టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఉండగా రెండో కూతురు ఇంటర్ చదువుతుంది. ఈ క్రమంలో తల్లి సీత సుబ్బారావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టకుని కూతుర్లు ఇద్దరినీ వేధిస్తుందని ఇద్దరు కూతర్లు వారం రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి పెద్దల సమక్షంలో సర్దిచెప్పి ఇంటికి పంపారు. అయితే ఇద్దరు కూతుర్లను ఇంట్లోకి రానివ్వకుండా కొట్టి కూతుర్లపైనే కేసు పెట్టేందుకు సీత పోలీసుల వద్దకు వెళ్లడంతో పిల్లలు ఇద్దరూ తమ తల్లి తమను వేధిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరి ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు.