Home ప్రకాశం యువతకు ఉపాధితోనే సమాజాభివృద్ది : డీఎస్పి జయరామసుబ్బారెడ్డి

యువతకు ఉపాధితోనే సమాజాభివృద్ది : డీఎస్పి జయరామసుబ్బారెడ్డి

503
0

– నేరాల నియంత్రణకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదు
– ఉద్యోగ కల్పనతో నేరాల నియంత్రణ, మెరుగైన సమాజం
– ఆడవారిని గౌరవించడం మనందరి భాద్యత
– స్కిల్ డెవలప్మెంట్ స్కీంతో పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
చీరాల : నేరాలను అదుపు చేసేందుకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, సామాజికబాధ్యతపై చైతన్యం కలిగించడమే పరిష్కార మార్గమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఈపురుపలేం ఐటీఐ కాలేజీలో ఆంద్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ది సంస్థ, బ్రహ్మనాయుడు ఐటిఐ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి మాట్లాడుతూ యువతలో మార్పుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవటానికి కఠిన మైన చట్టాలు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని రకాల నైపుణ్యాభివృద్ది కోర్సులను సద్వినియోగం వినియోగించుకోవాలని చెప్పారు. ఎక్కువ శాతం నిరుద్యోగ సమస్యతోనే నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

చీరాల శ్రీకామాక్షి కేర్ హస్పిటల్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్‌ తాడివలస దేవరాజు మాట్లాడుతూ విద్యార్ధులు చదువుకునేటప్పుడే భవిష్యత్తుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని చదువులో ముందుకెళ్లాలని చెప్పారు. ఏ కంపెనీకైనా ఉద్యోగులకు నాలుగు రకాల సామర్ధ్యం కలిగి ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. సమయపాలన, కమిట్మెంట్, రెస్పాన్సిబులిటీ, టెక్నికల్ స్కిల్స్ అప్ డేటెడ్‌గా ఉండాలన్నారు. ఈ నాలుగు రకాల అర్హతలు ఉంటే ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కొన్ని వేల జాబులు అందుబాటులో ఉంటే స్కిల్ ఉన్నటువంటి వాళ్లు 100లలో ఉన్నారని చెప్పారు.

చీరాల మండల మాజీ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ బాగా కష్ట పడి ఉన్నత శిఖ రాలను చేరుకోవాలని చెప్పారు. యువత దేశానికి వరమన్నారు. విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. మహిళల పట్ల గౌరవ భావంతో ప్రవర్తించాలని సూచించారు. జాబ్ మేళాకు మొత్తం154 మంది హాజరు కాగా 80మంది వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు ప్రకాశం జిల్లా స్కిల్ దేవలెప్ మెంట్ కార్పోరేషన్‌ మేనేజర్ ఆర్ లోకనాదం తెలిపారు. మొత్తం 8కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు.

కాలేజి ప్రిన్సిపాల్, చైర్మన్ ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మెగా జాబ్ మేళాలను వినియోగించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఏ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, ఈపురుపాలెం యస్ఐ వి సుధాకర్, వీరయ్య, దేవరపల్లి బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.