Home బాపట్ల నాగులపాలెం వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మించాలి

నాగులపాలెం వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మించాలి

6
0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

• రైతులు, గ్రామస్థుల రాస్తారోకో
• రెండు గంటలకుపైగా నిలిచిన వాహనాలు
• ఇబ్బంది పడ్డ ప్రయాణికులు, వాహనదారులు
• పట్టించుకోని హైవే కాంట్రాక్టర్లు
• డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
పర్చూరు (DN5 News) : మండలంలోని నాగులపాలెం గ్రామానికి అప్రోచ్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని నాగులపాలెం, ఉప్పుటూరు గ్రామాల మధ్య నిర్మించిన పిడుగురాళ్ల, వాడరేవు 167ఎ జాతీయ రహదారిపై ఆయా గ్రామాల రైతులు, ప్రజలు రాస్తూరోకో చేశారు. రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ మీటర్‌పైగా ఆర్టీసీ బస్సులు, కార్లు, వివిధ వాహనాలు నిలిచిపోయాయి. వివిధ గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా నాలుగులపాలెం రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ గతేడాది నుండి హైవే నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఉప్పుటూరు వాగుఫై నిర్మించిన బ్రిడ్జ్ పక్కనగల ఎస్ఎఫ్ఎస్ పాఠశాల సమీపంలో నుండి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని హైవే నిర్మాణదారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని తెలిపారు.

వర్షాకాలంలో వేల ఎకరాల పొలాలు ముంపుకు గురవుతాయని, వర్షపు నీరు, మురుగు నీరు పోవడానికి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణ దారులు, రైతులు, గ్రామస్తుల సమస్యను పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అసలు పట్టించుకోక పోవడంతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వివరించారు. తమ పొలాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అప్ప్రోచ్ రోడ్డు వెయ్యమని ఎన్ని సార్లు మొరపెట్టుకున్న వేయలేదని అన్నారు. తమ భూములకు వెళ్లాలంటే చుట్టూ కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. రోడ్డు పూర్తికాకుండానే ఉప్పుటూరు టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు చేస్తున్నారని అన్నారు. నాగులపాలెం నుంచి కారంచేడు వెళ్లాలంటే రూ.200 టోల్ వసూలు చేస్తున్నారని అన్నారు. గ్రామస్తులు జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి వాహనాలు నిలుపుదలచేసి రాస్తరోకు నిర్వహించారు.

గుత్తేదారులు గ్రామస్తులను పిలిపించి సమస్యపై మాట్లాడాలని చెప్పారు. మండుటెండలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, రైతు కూలీలు, వృద్ధులు, చిన్న పిల్లలు తాగునీరు లేక ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్డిఓ పి గ్లోరియా మాట్లాడుతూ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి హైవే నిర్మాణ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. డ్రైనేజీ సమస్యకు సంబంధించి డ్రైనేజీ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఆర్డిఓ వెంట తహశీల్దారు బ్రహ్మయ్య, ఆర్ఐ హుస్సేన్, విఆర్‌ఒ శ్రీనివాసరావు, డిఎస్పీ జగదీష్ నాయక్, ఎస్ఐ గోపి పాల్గొన్నారు.