Home ప్రకాశం ఉప్పలపాడు పాపారావు స్కూల్ విద్యార్థుల శాంతి ర్యాలీ

ఉప్పలపాడు పాపారావు స్కూల్ విద్యార్థుల శాంతి ర్యాలీ

745
0

కొండెపి : పుల్వామా ‘ఉగ్ర’వాద దాడిలో వీరమరణం పొందిన భారత సైనికులకు ఘనంగా నివాళి అర్పిస్తూ ఉప్పలపాడులోని పాపారావు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. పాఠశాల కరెస్పాన్డెంట్ చిడిపోతు శిశిర్ చౌదరి, ప్రిన్సిపాల్ టి అనూరాధ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు, విద్యార్థులు గ్రామంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. యుద్ధం వద్దు-శాంతి ముద్దు, జోహర్ అమర జవానులకు, జై జై ఇండియన్ ఆర్మీ జై జై, తరిమికొట్టు-ఉగ్రవాదాన్ని తరిమి కొట్టు అంటూ ఉపాద్యాయులు, విద్యార్థుల నినాదాలతో ఉప్పలపాడు మారుమ్రోగింది.