చిత్తూరు : నగరి ఎంఎల్ఎ రోజకు ఎపిఐఐసి ఛైర్మన్ పదవి వరించనుంది. గత రెండేళ్లుగా వైసిపి విజయానికి ఫైర్‌బ్రాండ్‌గా పనిచేసిన ఎంఎల్ఎ రోజకు వైసిపి ప్రభుత్వంలో మంత్రిపదవి దక్కుతుందని ఆశించారు. అయితే ఆమెకు స్థానం దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. శాసన సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా వచ్చిన ఆమెతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. రాష్ట్ర అభివృద్దిలో కీలకమైన పారిశ్రమల మౌళిక వసతుల కల్పన సంస్థ (ఎపిఐఐసి) ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఆమెకు హామీ ఇచ్చారు. అయితే ఈ పదవిపై ఎంఎల్ఎ రోజ అభిప్రాయం చెప్పాల్సి ఉంది.