APCM Jagan : కొత్త కార్యక్రమానికి కసరత్తు

    118
    0

    అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత సిఎం వైఎస్‌ జగన్ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టనున్నారు. గ్రామాల నుండి పార్టీని పటిష్టం చేసే పనిలో భాగంగా పల్లెల నుంచే ఆరంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షడు ప్రతి రోజూ తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ సచివాలయం పరిధిలో లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తారు.

    ఆ తరువాత సదరు లబ్దిదారులతో నేరుగా మమేకం అవుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మళ్లీ లబ్దిదారులతో మాటా మంతీ కొనసాగిస్తారు. సాయంత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. మండల అధ్యక్షుడి నేతృత్వంలో గ్రామంలోని పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతారు. ఈ భేటీలో రాత్రి నేతలంతా కలిసి భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో లేదా వార్డులో నేతల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఈ క్రమంలోనే దీనితోపాటు కొత్తవారిని చేర్చుకునే అంశంపై చర్చిస్తారు. దీనిపైన వచ్చే వారం పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.