Home ఆంధ్రప్రదేశ్ ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో సంచ‌ల‌నం.. ఆ విద్యార్థినికి 600/600 మార్కులు!

ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో సంచ‌ల‌నం.. ఆ విద్యార్థినికి 600/600 మార్కులు!

179
0

వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు-2025 తాజాగా విడుదలైన విష‌యం తెలిసిందే. రాష్ట్ర ఐటీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ ఫలితాలు విడుద‌ల చేశారు. అయితే, ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఓ సంచ‌ల‌నం న‌మోదైంది. కాకినాడ‌కు చెందిన నేహాంజ‌ని అనే విద్యార్థిని 600 మార్కుల‌కు 600 మార్కులు సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. ఆమె కాకినాడలోని ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ పాఠ‌శాల‌లో చ‌దివిన‌ట్లు స‌మాచారం.

ఇక‌, ఈ ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణుల‌య్యారు. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.