Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా ఎపి నిలుస్తుంది : ఏలూరి

చంద్రబాబు నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా ఎపి నిలుస్తుంది : ఏలూరి

38
0

• దేశ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర కీలకం
• రోజుకు 20 గంటలకు పనిచేసే సీఎం బాబు మాత్రమే
• కుప్పం తెలుగుదేశంకు కంచుకోట
• సీఎంగా చంద్రబాబును అందించిన ఘనత కుప్పం నేతలదే
• కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే ఏలూరి
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలుగుదేశం బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం ముఖ్య కార్యకర్తల సెమినార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం తెలుగుదేశంకు బలమైన కంచుకోటగా నిలిచిందన్నారు. కార్యకర్తలు, నేతల సమన్వయం, కృషి వల్ల పార్టీ విజయపథంలో ముందుకు సాగుతుందన్నారు.

అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబును అందించిన ఘనత కుప్పం నియోజకవర్గ ప్రజలదేనని అన్నారు. రాష్ట్రానికి రోజుకు 20గంటలు పని చేసే సత్తా, శక్తి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగుదేశంకు కుప్పం నియోజకవర్గం కంచుకోటగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కంచుకోటగా తయారు చేస్తామని అన్నారు. కుప్పం నియోజకవర్గం తెలుగుదేశంకు తిరుగులేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు అంకితభావం, ప్రజాప్రేమ, కృషి అన్నీ ఈ తొమ్మిది నెలల పాటు జరిగిన మహత్తర పాదయాత్రలో స్పష్టంగా కనిపించాయని అన్నారు. 9 నెలలు 7500 కిలోమీటర్ల మేర రాష్ట్ర మంతా కాలినడకన ప్రయాణం, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని, వారికి మార్గదర్శనం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు బాగాకష్టపడతారని, మనం రోజుకి 8 గంటలే పని చేస్తామని, 60ఏళ్లు వయస్సు దాటినా రోజుకు 24 గంటల్లో కేవలం 3 లేక 4 గంటలే నిద్రించి మిగిలిన సమయాన్ని ప్రజలతో గడపడం ఆయనకు మాత్రమే సాధ్యమని అన్నారు.

ఎండ, వానా అన్నదీ పట్టించుకోకుండా నిరంతరాయంగా పాదయాత్ర, భవిష్యత్ తరాలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రతి ప్రాంతాన్ని సందర్శించి నేరుగా సమస్యలు విన్నారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి దారి చూపే ఈ పాదయాత్ర, ప్రజలతో ఆయన బంధాన్ని చూపించే చిరస్థాయి గుర్తుగా నిలిచిపోతుందని అన్నారు.

పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తల పాత్ర, జెండా, అభిప్రాయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా వ్యాపింపజేయాలని సూచించారు. ప్రజలకు నిజమైన అభివృద్ధి ఎవరు చేయగలరో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నూతన వ్యూహాలతో ముందుకు సాగడం, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కుప్పంలో టీడీపీకి తిరుగులేదని ధీమా, స్థానికంగా టీడీపీ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అనేక ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.