Home ఆంధ్రప్రదేశ్ AP Inter results 2025 : ఇక ఏపీలో ఇంటర్ ఫలితాలు వాట్సాప్ లోనే..! ఎప్పుడంటే..?

AP Inter results 2025 : ఇక ఏపీలో ఇంటర్ ఫలితాలు వాట్సాప్ లోనే..! ఎప్పుడంటే..?

183
0

అమరావతి : ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు చురుగ్గా నిర్వహిస్తుంది. త్వరలో ఫలితాల విడుదలకు సిద్దమవుతోంది. వీటికి సంబంధించిన కీలక వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి? ఎక్కడ వీటిని తెలుసుకోవచ్చనే వివరాలు ఉన్నాయి.

ఇంటర్ మీడియట్ పరీక్ష మొదటి, ద్వితీయ ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఫలితాలు వాట్సాప్ లోనే చూసు కునేందుకు వీలు కల్పించారు. ఈపాటికే అన్ని పరీక్షల ఫలితాలు వాట్సాప్ లోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలు కూడా ఇదే విధానంలో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్య ఎప్పుడైనా ఇంటర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6న పూర్తవుతోంది. ఆ తర్వాత వీటిని కంప్యూటర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి మరో ఐదారు రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేయనున్నారు. వాట్సాప్ లో విడుదల చేసే ఫలితాలు షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. కాబట్టి వీటిని పీడీఎఫ్ రూపంలోనే ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇంటర్ ఫలితాలను bieap.apcfss.in లేదా resultsbie.ap.gov.in వెబ్ సైట్లలోనూ తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది మార్చి 1 నుంచి 19వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.