Home ఆంధ్రప్రదేశ్ ఎస్ఇసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించండి

ఎస్ఇసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించండి

346
0

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో భారీ షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొల‌గింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీల‌క తీర్పు వెలువరించింది. ఎస్ఈసి తొలగింపు కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల‌న్నీ రద్దు చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా తిరిగి నియమించాని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌ఈసీ విషయంలో నిబంధల‌ను మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేష్‌కుమార్‌ ఎన్నికల‌ కమీషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు వెల్ల‌డించిన అనంతరం న్యాయవాది జంద్యాల‌ రవిశంకర్‌  మీడియాతో మాట్లాడారు. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల‌ కమీషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల‌ కమీషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని చెప్పారు. ఎస్ఈసి పదవీకాలం కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నట్టేనని వివరించారు. రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లం ఘనకు ప్పాడిందని పిటీషనర్‌, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ హైకోర్టు తీర్పు అనంతరం మీడియా అన్నారు. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనగరాజును నియమించిన వ్యవహారం దోషపూరితంగా ఉందన్నారు. కోర్టు ఆదేశాల‌ను సానుకూలంగా తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టమన్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అనుమతితోనే హైకోర్టులో తాను పిటీషన్‌ దాఖలు చేసినట్లు కామినేని శ్రీనివాస్ చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో తీసిపారేసింది. ఎల్జీ పాలిమర్స్‌ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ప్రభుత్వం తాను తప్పు చేస్తూ న్యాయ వ్యవస్థను నిందించడం సరికాదని అన్నారు. కేంద్రానికి మనతో పని ఉంటుందని ‘జగన్‌’ అనడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కేంద్రాన్ని అస్థిర పరచాల‌ని సిఎం చూస్తున్నారా? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవాల‌ని సిఎంకు విజ్ఞప్తి చేస్తున్నానని ‘కామినేని శ్రీనివాస్’ పేర్కొన్నారు.