Home ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక  శ్రద్ద :  దాసరి రాజా మాష్టారు

వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక  శ్రద్ద :  దాసరి రాజా మాష్టారు

338
0

కందుకూరు : ఎపి ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టందని టిడిపి శిక్ష‌ణా కేంద్రం డైరెక్ట‌ర్‌, టిడిపి రాష్ర్ట‌కార్య‌ద‌ర్శి దాస‌రి రాజామాస్టారు పేర్కొన్నారు. మంగళగిరి ఏపిఐఐసి ఇండస్ర్టీయల్ ఏస్టేట్లో లిండే ఫుడ్ ల్యాబ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించార‌న్నారు. ఆయ‌న‌ కృషి ఫలితంగా మరో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్నారు.  నూతన టెక్నాలజీతో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ తోపాటు స్కిల్ డవలప్ మెంట్ శిక్షణా సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.  ఇటువంటి కంపెనీ ప్రపంచలో ఇప్పటి వరకు రెండే ఉన్నాయన్నారు. ఇప్పుడు మన రాష్ర్టంలో ఏర్పాటు చేశారని తెలిపారు. వ్యవసాయం, దాని అనుభంద రంగాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. తెలుగు విజయం ప్రాంగణంలో జరుగుతున్న152వ బాచ్ టిడిపి శిక్షణ ముగిపు స‌భ‌లో ఆయన శిక్షణకు హాజరైన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఆహార ఉత్పత్తులైన సీ ఫుడ్స్, కూరగాయల ఉత్పత్తుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు.

ప్రస్తుతం రాష్ర్టంలో పండుతున్న ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి అక్కడ ప్రాసెస్ అయిన ఫుడ్ తరువాత మళ్లీ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండడంతో పాటు రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏపీలోనే ఏర్పాటు చేయడం వల్ల రైతులు తాము పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను అందుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా దక్కుతాయన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్ధాలు లభిస్తాయన్నారు. లిండే ఇండియా లాంటి అంతర్జాతీయ కంపెనీని రాష్ర్టానికి తీసుకురావడం మ‌చిప‌రిణామ‌మ‌న్నారు. సీనియర్ నేత చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన వల్ల రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఫిబ్రవరి 24 నుండి విశాఖపట్నంలో జ‌రిగే బాగస్వామ్య సదస్సు ద్వార మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయనే ఆశాభావాన్ని రాజా వ్యక్తంచేశారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణలో బాగంగా పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 14 వరకు వేస్తార‌ని తెలిపారు. ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రైతులు, వ్య‌వ‌సాయ సంక్షేమ ప‌థ‌కాల‌తో రైతుల‌కు ప్రభుత్వం వెన్నుద‌న్నుగా ఉంద‌న్నారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులు అంద‌జేశారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ ఆచ్చారు. కార్యక్రమంలో కందుకూరు జడ్పీటిసి కంచర్ల శ్రీకాంత్, శిభిరం కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.