Home ఆంధ్రప్రదేశ్ బిజెపి, వైసీపీలపై ఆర్ధికమంత్రి యనమల ఫైర్

బిజెపి, వైసీపీలపై ఆర్ధికమంత్రి యనమల ఫైర్

392
0

అమరావతి : కేంద్రంలో గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు, హెచ్ డి దేవెగౌడ, ఐకె గుజారాల్ ప్రధాన మంత్రులు కావడంలో చంద్రబాబు నాయుడు అప్పట్లో కీలకపాత్ర పోషించారని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అప్పటి నుండి దేవెగౌడ, కుమారస్వామిలతో చంద్రబాబుకు పరిచయాలు ఉన్నాయన్నారు. ఆ స్నేహంతో కుమారస్వామి ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార సభలో హాజరైనారని చెప్పారు. ఆ సభకు హాజరైన వారిలో వామపక్ష పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం చాంబర్లో ఏపీకి ప్రత్యేకహోదా, అభివృద్ధి నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయం పై చర్చించారని యనమల అన్నారు.

అదే వేదికపై కాంగ్రెస్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి మర్యాద పూర్వకంగా నమస్కారం చేశారని చెప్పారు. అలా గౌరవించడం భారతీయ సంస్కృతి అన్నారు. దానినికుడా తప్పుపట్టి రాజకీయం చేయాలనుకోవడం హేయమైన పదాటాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ పార్టీల నేతలతో జరిగిన చర్చలలో కాంగ్రెస్ పార్టీ లేదనేది గుర్తుంచుకోవాలన్నారు. జెడి(ఎస్) ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పిలిచిందని వెళ్లలేదు అనేది గుర్తుంచుకోవాలని యనమల హెచ్చరించారు.

యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక చంద్రబాబుదేనని యనమల పేర్కొన్నారు. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ ప్రధాని కావడంలో కీలకపాత్ర చంద్రబాబుదేనన్నారు. దేవెగౌడతో సాన్నిహిత్యం, కుమార స్వామి ఆహ్వానం మేరకే బెంగళూరు వెళ్లారని తెలిపారు. అందుకే ప్రమాణ స్వీకారంలో భాగం పంచుకున్నామన్నారు. ప్రాంతీయపార్టీలు, వామ పక్షాల నేతలతో తన ఛాంబర్ లో చర్చలు జరిపారని తెలిపారు.

కాంగ్రెస్ మంత్రుల ప్రమాణానికి సోనియా,రాహుల్ హాజరయ్యారైన సందర్భంలో వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారం అన్నారు.
భారతీయ సంస్కారాన్ని కూడా తప్పు పట్టడం బిజెపి,వైసీపి సంస్కృటాని యనమల ప్రశ్నించారు. శాసనసభలో జాతీయగీతం వస్తుంటే సభనుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతని ఎద్దేవాచేశారు.

కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతని యనమల ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లలేదని అన్నారు. యాదృచ్చికంగా ఎదురైతే అభినందించడాన్ని తప్పుపట్టడం దివాలాకోరుతనమని అన్నారు. ఓట్లకోసం వచ్చిన కోవింద్ కాళ్లు ఏ1,ఏ2 నిందితులు పట్టుకోవడాన్ని ఏమనాలని యనమల ప్రశ్నించారు. ఢిల్లీలో కేంద్రపెద్దల ఛాంబర్లకు జగన్ వెళ్లి కాళ్లు పట్టుకోవడాన్ని ఏమనాలని, బెంగళూరు ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో బిజెపికి అనుకూలంగా పనిచేశావు కాబట్టే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ వెళ్లలేదని యనమల ఆరోపించారు. ముఖం చెల్లలేదు కాబట్టే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదని అన్నారు. 2019లో బిజెపితో పొత్తుకోసమే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదని, బిజెపితో తన పొత్తు చెడిపోతుందనే భయంతోనే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ గైర్హాజర అయ్యారని యనమల ఆరోపించారు.

జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకున్న ఇమేజి దేశంలో అందరికీ తెలిసిందేనాని చెప్పారు. కాళ్లు పట్టుకునే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిది అందెవేసిన చెయ్యి అని యనమల అన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకున్న ఘన చరిత చూసే బెంగళూరులో అన్నిపార్టీలు గౌరవించాయన్నారు. బిజెపి తప్ప ఎవరూ జగన్మోహన్ రెడ్డిని కలుపుకొరన్నారు. కర్ణాటకలో గాలి జనార్ధన రెడ్డితో, ఏపిలో జగన్మోహన్ రెడ్డితో బిజెపి వెళ్తోందని పేర్కొన్నారు.

వేదికపై కలిస్తే చిలవలు పలవలు సృష్టించడం వైసిపి నీచ సంస్కృతని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో 25పార్లమెంట్ స్థానాలలో టిడిపి ఘనవిజయం ఖాయమన్నారు. కేంద్రంలో రాబోయేది బిజేపీయేతర ప్రభుత్వమేనేనెందుకు బెంగళూరులో ప్రాంతీయపార్టీలు, వామపక్షాల భేటినే నాంది చెప్పారు.

బిజెపికి వైఎస్సార్ కాంగ్రెస్ తో ఎంగేజ్ మెంట్ ఈ పాటికే అయ్యిందని, 2019ముహూర్తం కూడా నిర్ణయించారని యనమల అన్నారు. చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనేదే బిజెపి, వైసీపీ కుట్ర అని పేర్కొన్నారు. నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని యనమల రామకృష్ణుడు చెప్పారు.