విజయవాడ : ఏపి కొత్త మంత్రివర్గ జాబితా గవర్నర్ వద్దకు చేరింది. ఈ జాబితాకు గవర్నర్ సాంకేతికంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ జాబితాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు అందచేశారు. నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం చేయించేందుకు విజయవాడ వచ్చిన గవర్నర్ గేట్ వే హోటల్ లో బసచేశారు. ఆయనతో జగన్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం అందించారు. శాలువాకప్పి సాదర స్వాగతం కలిపారు. ఆ తరువాత ఆయనతో కొద్దిసేపు చర్చించి మంత్రివర్గ జాబితాను అందచేశారు. గవర్నర్ సాంకేతికంగా ఆమోదించాల్సి ఉన్నందున ఒక రోజు ముందుగానే జాబితాను గవర్నర్ కు అందచేశారు. మంత్రివర్గ కూర్పులో తీసుకున్న అంశాలను గవర్నర్ కు జగన్ వివరించారు.







