Home ప్రకాశం మార్చి 2న అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’

మార్చి 2న అంగన్‌వాడీల ‘చలో విజయవాడ’

5
0

అద్దంకి (DN5 News) : ఐసిడిఎస్ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు పెంచాలని అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పెండింగులో ఉన్న హెల్పర్ ప్రమోషన్లకు నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించాలని, మే నెల వేసవి సెలవులు జిఒ ఇవ్వాలని, ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి మార్చి 2న ఎపి అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపులో భాగంగా అందరూ విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో జరిగే మహా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. కలవకూరు సెక్టార్ అంగన్‌వాడి సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్‌పై అధికారుల వేధింపులు మానసిక ఒత్తిడులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత సమ్మె కాలంలో ప్రతిపక్షంలో ఉండి అంగన్‌వాడీలకు మద్దతు తెలియజేస్తూ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్న కనీసం ఈ బడ్జెట్లో అంగన్‌వాడీలకు వేతనాల పెంపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి నాగేశ్వరరావు, అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సెక్టార్ నాయకులు భాగ్యలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.