చీరాల : ఆంధ్రారత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 131 జయంతి కార్యక్రమం మంగళవారం చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అనారోగ్యంతో బాధపడుతున్న హారిస్ పేట నివాసిని నాగమణి కుమారుడికి నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.