– కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు – ప్రపంచ ఎనస్తిషియా డే సంద్భర్బంగా మత్తు వైద్యులకు సన్మా నం – డాక్టర్ ముద్దన నాగేశ్వరావు వైద్య సేవలు చీరాల ప్రజలకు అపరిమితం.
మనిషి ప్రాణాలు నిలపటంలో మత్తు వైద్యుడే కీలకమని కామాక్షి కేర్ వైద్య శాల ఎండీ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ప్రపంచ ఎనస్తేశియా దినోత్సవాన్ని పుర్కరించుకొని బుధవారం శ్రీ కామాక్షి కేర్ వైద్య శాలలో మత్తు వైద్యులు డాక్టర్ ముద్దన నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ శస్త్ర చికిత్స సమయంలో మత్తు వైద్యుడు చాలా ముఖ్య భూమిక పోషిస్తారని తెలిపారు. పూర్వం ఆధునిక విధానం అందుబాటులోకి రాక ముందు శస్త్ర చికిత్స చాలా బాధాకరంగా ఉండేదన్నారు. మత్తు లేకుండానే ఆపరేషన్ చేసే వారన్నారు. తరువాత మత్తు నిచ్చే ద్రావణాన్ని తాగించి ఆపరేషన్ చేసేవారని తెలిపారు. ఇలా అనేక పద్దతులు మారిన తరువాత ప్రస్తుతం ఉన్న విధానం అమలులోకి వచ్చిందన్నారు. దీంతో చికిత్స సులువుగా మారిందని తెలిపారు. రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టి ఎంత మొత్తం మత్తు ఇవ్వాలో మత్తు వైద్యుడు నిర్ణయిస్తారని చేెప్పారు. ఇది అత్యంత క్లిష్టమైన పక్రియని పేర్కొన్నారు. మత్తు ఇచే విధానంలో తేడా వస్తే రోగి పరిస్తితి ఇబ్బంది కరంగా మారుతుందన్నారు. చిన్న అపరేషన్ అయినా, పెద్ద ఆపరేషన్ అయినా విజయవంతం అవ్వాలంటే మత్తు వైద్యుడే కీలకమన్నారు. అనంతరం మత్తు వైద్యులు డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సందర్భాలలో మనిషిని ప్రాణాలను కాపాడినప్పుడే ఉండేటటువంటి ఆనందం మాటల్లో చెప్పలేదని అన్నారు. ఒక మనిషిని బతి కొచ్చినప్పుడు మేం పడిన కష్టం మొత్తం మర్చిపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ తాడివలస సురేష్, నారాయణ, నరేష్, రేవంత్, రాజశేఖర్, కొండారెడ్డి, శ్రీను పాల్గొన్నారు.