Home బాపట్ల ఎమ్మెల్యే ఆనందబాబుకు అవమానం

ఎమ్మెల్యే ఆనందబాబుకు అవమానం

27
0

బాపట్ల (Bapatla) : బాపట్లలో అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Wajpayee) విగ్రహావిష్కరణ ఫ్లెక్సీపై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు (Vemuru MLA Nakka Anandababu) ఫోటో లేక పోవడంతో ఆయనకు తీరని అవమానం జరిగిందని చర్చ జరుగుతుంది. బిజెపి (BJP)ఆధ్వర్యంలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల (Engeniring College) వై జంక్షన్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేదిక వద్ద ప్రధాన ఫ్లెక్సీపై ఆనందబాబు ఫోటో లేకపోవడంతో అవమానంగా భావించిన ఆయన సభ జరుగుతున్న సమయంలో వేదిక నుండి దిగి వెళ్లిపోయారు.

బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు ఆయనను ఆహ్వానించారు. సభా స్థలి వద్ద ఫ్లెక్సీల్లో జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల ఫోటోలు ప్రచురించగా ఆనందబాబు ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రిగా, టిడిపి పోలెట్ బ్యూరో సభ్యులుగా ఉన్న ఆనందబాబు ఫోటో లేకపోవడం వివక్ష చూపడమేనని ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
హాజరుకాని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ (Ex.MLC Annam Satish Prabhakar) హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది. విగ్రహం ఏర్పాటు సన్నాహక సమావేశాల్లో పాల్గొని, విగ్రహ ఏర్పాట్లు పరిశీలించిన ఆయన విగ్రహావిష్కరణకు హాజరు కాకపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది.