చీరాల (Dn5 News) : పదో తరగతి పరీక్షా ఫలితాలలో వాడరేవు ఎఎంజి హై స్కూల్ విద్యార్థి అడివిపల్లిపాలెంకూ చెందిన ఉప్పాల ఆనంద్ కుమార్ 575 మార్కులతో ప్రధమ స్థానం సాధించాడు. కోనాడ కీరన 572 మార్కులతో ద్వితీయ స్థానం, పిక్కి ఆష 567 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. పాఠశాల నుండి పరీక్షకు హాజరైన 50 మంది విద్యార్థుల్లో 19 మంది 500 పైగా మార్కులు సాధించారని ప్రిన్సిపల్ తెలిపారు. వీరిలో 48 మంది ప్రధమ శ్రేణి, ఇద్దరు ద్వితీయ శ్రేణిలో నూరు శాతం ఉతిర్ణత సాధించినట్లు తెలిపారు. అత్యంత ఫలితాలు సాధించిన విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులను ఎఎంజి సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి అభినందించారు. అందరు విద్యార్థులు పేద మత్స్యకారుల పిల్లలు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదివి మంచి ఇంతటి ఫలితాలు సాధించినందుకు విద్యార్థులు, వారి తల్లి, దండ్రులను అభినందించారు.