Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర విధానాలపై అమెరికన్ వాల్స్ట్రీట్ పత్రికలో ఘాటు విమర్శలు

ఆంధ్ర విధానాలపై అమెరికన్ వాల్స్ట్రీట్ పత్రికలో ఘాటు విమర్శలు

794
0

అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఏపి విధానాలపై ఘాటు విమర్శలు చేస్తూ కధనం ప్రచురించింది. నిన్న అమెరికాలో ప్రముఖ వార్త. భారత దేశంలో సోలార్ పవర్ మొన్నటి దాకా ఎంతో బాగుండేది అని తాజాగా మారిన పరిస్తితుల్లో ఇప్పుడు సోలార పవర్ లో భారత దేశం వెనుక పడింది అంటూ ఒక వార్త ప్రచురించింది వాల్ స్ట్రీట్ జనరల్. భారత దేశంలో సోలార్ పవర్ ఎందుకు పడిపోతుందో చెప్తూ ఆంధ్రప్రదేశ్ విధానాలు కూడా ఒక కారణంగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. ఇండియాలో దక్షిణాదిన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి దాకా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఇక్కడ అధికంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి వాడకం కూడా జరిగేది. అయితే ఈ రంగంలో చేసుకున్న ఒప్పందాలు మళ్ళీ సమీక్షిస్తాం( రివర్స్ టెండరింగ్), మాకు తక్కువ రేటుకు ఇవ్వాల్సిందే అని అక్కడ ప్రభుత్వం ( ఏపీ ప్రభుత్వం) చెప్పటంతో ఈ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది అంటూ వాల్ స్ట్రీట్ జనరల్ మన రాష్ట్ర విధానాలు గురించి రాసింది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ప్రధాని మోడీకి కూడా ఫిర్యాదు చేసాయి. అలాగే దావోస్ లో కూడా ఇదే చర్చ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వద్ద జరిగింది. ఇప్పుడు భారత దేశంలో సోలార్ పవర్ పడిపోవటంలో ఏపి కూడా ఒక కారణం అని అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా చెప్తుంది. ఏపీ ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్న పొరపాటు సరిదిద్దితే రాష్ట్రానికే కాదు, దేశానికీ కూడా మంచిది. లేకపోతే మన విధానాల వల్ల దేశం ఇమేజ్ కూడా ఇలా అంతర్జాతీయంగా పోతుంది.