అద్దంకి (DN5 News) : ‘అమెరికా వాణిజ్య వ్యవసాయ ఒప్పందాలు భారతదేశంపై ప్రభావం’ అంశంపై పట్టణంలోని ప్రకాశం జూనియర్ కాలేజీలో జెవివి, యుటిఎఫ్, సిఐటియు (JVV, CITU, UTF)సంయుక్తంగా గురువారం సదస్సు నిర్వహించారు. సదస్సులో జెవివి రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మారావు (ExMLC KS Lakshmanarao)మాట్లాడారు. అమెరికా (America) ఆర్థికంగా వెనుక పడుతూ ఉండడంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం తోపాటు అక్కస్సుతో రకరకాల దాడులు చేస్తుందని అన్నారు. అమెరికా, డాలర్ (Doller) విలువ క్షీణిస్తుండడంతో ట్రంపు అన్ని విషయాల్లో టెంప్ట్ అవుతున్నాడని అన్నారు. భారతదేశంపై సుంకాలు విధించడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు. వివిధ అంశాలపై విసిదీకరించారు. ఆయుధాల వ్యాపారం కోసం ఎప్పుడు తమ దేశంపైనే ఆధారపడాలనే ఆలోచనతో ప్రపంచంలో పలు దేశాలు మధ్య అమెరికా ఉసిగొల్పుతున్నదని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలు ఎండగట్టాలని అన్నారు. కార్యక్రమంలో తంగా శ్రీనివాసరావు, ఉబ్బా దేవపాలన, డాక్టర్ కావూరు రఘు చంద్, డాక్టర్ వై హనుమంతరావు, జ్యోతి చంద్రమౌళి, మన్నం త్రిమూర్తులు, తంగిరాల వెంకటేశ్వర్లు, సర్వేశ్వరరావు, కె శ్రీనివాసరావు, చెన్నుపాటి రామాంజనేయులు, అంకారావు, శేషగిరి పాల్గొన్నారు.






