చీరాల : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మార్పు గ్రెగరీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వైసీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో స్వీకారోత్సవ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగామ సురేష్ హాజరయ్యారు.
సభలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని పేర్కొన్నారు. అవినీతి అక్రమాలకు వేదిక అయినటువంటి పార్టీ టిడిపి అని ఆరోపించారు. 1983 నుంచి టిడిపి తెరపైకి వచ్చిన తరువాత ఒకే సామాజికవర్గం రాష్ట్రాన్ని దోచుకున్నారని టిడిపిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు అతిథులను సత్కరించారు.