Home ప్రకాశం సందర్భమేదైనా ఆమంచి టార్గెట్‌ ఒక్కటే….

సందర్భమేదైనా ఆమంచి టార్గెట్‌ ఒక్కటే….

309
0

చీరాల : నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో వ్యక్తిగా ఉండే చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా చేనేత నేస్తం పథకం ప్రారంభ సభ చీరాలలో ఏర్పాటు చేశారు. సభకు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చీరాల వచ్చారు. ఈసందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో చీరాల గడియార స్థంభం కూడలిలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత ఐటిసి అతిధి గృహం నుండి కార్యకర్తలతో ర్యాలీగా వచ్చిన మంత్రి బాలినేని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం జగన్‌ జన్మదిన కేకును కత్తిరించి కార్యకర్తలకు పంచిపెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతిఏటా చేనేత కుటుంబానికి రూ.24వేల ఆర్ధిక సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో చేనేతలను గత ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబుపై విమర్శలు సందించారు. గతంలోనూ తాను ఇదే విమర్శలు చేశానని, మరోసారి గుర్తు చేస్తున్నానంటూ చెప్పారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి అనువైన పనులు మాత్రమే చేశారని చెప్పారు. చేనేత రుణమాఫీ చేస్తానని చెప్పి చేనేతలను మోసం చేశారన్నారు.