Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు… నాగార్జునరెడ్డిపై ఆమంచి కామెంట్స్

చంద్రబాబు… నాగార్జునరెడ్డిపై ఆమంచి కామెంట్స్

501
0

అమరావతి : నాగార్జున రెడ్డిపై హత్యాయత్నం ఘటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగార్జునరెడ్డి విషయంలో చంద్రబాబు దిగజారిప్రవర్తిస్తూ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నాడని ఆరోపించారు. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదన్నారు. ఇటీవల ఎన్నికలలో టిడిపి ఏజంట్‌ గా ఉన్నాడని చెప్పారు. కరణం బలరామ్‌ కు కూడా అత్యంత సన్నిహితుడిగా మారి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. కౌంటింగ్‌ ఏజంట్‌ గా ఉన్నప్పటికి నాగార్జునరెడ్డి తమ వాడని చంద్రబాబు చెప్పకపోవడానికి కారణం అతనిపై 17 క్రిమినల్‌ కేసులు ఉండటమేనన్నారు. మహిళలను వేధించిన కేసులు కూడా వాటిలో ఉన్నాయన్నారు. భార్యను వేధించడం, రేప్‌ కేసు ఇతర కేసులు వాటిలో చంద్రబాబు సిఎంగా ఉన్న కాలంలో నమోదైనవి కూడా ఉన్నాయన్నారు. నాగార్జునరెడ్డి మహిళా అధికారిపై రాసిన భాష చూస్తే జర్నలిస్ట్‌ అంటారా? అని ప్రశ్నించారు. అంగపూజ చేస్తున్నారంటూ మహిళా అధికారి గురించి అభ్యంతరకరంగా రాశారని గుర్తు చేసారు. అతను రాసిన వార్తల ఆధారాలు మీకు చూపుతాను… ఇది జర్నలిజం అంటారా?మీరు చెప్పండి అంటూ విలేకరులను ప్రశ్నించారు.

29 సంవత్సరాల యువ అధికారి ఛాన్‌ భాషాపట్ల అభ్యంతరకరంగా భాష ఉపయోగిస్తూ వార్తలు రాశాడన్నారు. “అరే కృష్ణమోహన్‌ గూట్లే… నేను రేప్‌ చేస్తే ఆమంచి కృష్ణమోహన్‌ చూడాలనుకుంటున్నాడు. వారి కుటుంబంలో నేను ఎవర్ని రేప్‌ చేశాను.” ఎధవ…. అని ఐఏఎస్‌ ని, మహిళా అధికారిని గురించి అంగపూజ అంటూ భాష ఉపయోగించాడని నాగార్జున రెడ్డి పెట్టిన సోషల్ మీడియా పోస్టులను చూపారు.

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఐవి సుబ్బారావు అనే వ్యక్తిని గురించి ఏం పోస్టులు పెట్టారో అడగండి చెబుతారని అన్నారు. తాను ప్రస్తావించిన అంశాలన్ని 17 కేసులలో ఉన్నాయన్నారు. తమ ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాబట్టి తనకు ఆపాదించారంటే అర్దం ఉంటుందన్నారు. నిజానిజాలు పోలీసులు తేలుస్తారని చెప్పారు.

వైయస్‌ జగన్‌ 151స్దానాలలో గెలిచి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అద్బుతమైన పాలన కొనసాగుతోందన్నారు. తాను పదిరోజులక్రితం రెండో బ్లాక్‌ వద్ద ఉంటే పులివెందులకు సంబంధించిన కార్యకర్తలు తనను కలిసి జగన్‌ ఏంటి కేజ్రీవాల్‌ లా వెళ్తున్నారని అడిగినట్లు చెప్పారు. వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో పవిత్ర యజ్ఞం చేస్తున్నారని అన్నారు. ప్రతి విషయాన్ని సిఎంకు ఆపాదించడం సరికాదన్నారు. వైయస్‌ జగన్‌ నీతినిజాయితీ ముందు చంద్రబాబు సరిపోడని పేర్కొన్నారు.

చంద్రబాబు ఆధ్వర్యంలో వంగవీటి రంగ హత్య జరిగితే వేయి కోట్ల మేర ఆస్దులు ధ్వంసం అయ్యాయని గుర్తు చేశారు. ఆ కేసులో ఒక చిన్నవ్యక్తికి కూడా శిక్ష పడకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెరుకులపాడు నారాయణరెడ్డిని ఏ విధంగా చంపారో ప్రజలకు తెలుసన్నారు. అరాచకం అంటే ఆదన్నారు. దానికి ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని అన్నారు.

పద్మ అనే అమ్మాయికి నర్సమ్మకు ఇంట్లో చదివింపుకు సంబంధించి వివాదం నేపధ్యంలో ఆత్మహత్య చేసుకుందన్నారు. గతంలో 13 కేసులు పెట్టిందన్నారు. కుమారుడుపై రేప్‌ కేసు పెట్టిందన్నారు. తమ ఫ్యాక్టరీలో పనిచేసిందని పేర్కొన్నారు. అయితే ఆమె ఆత్మహత్యను కూడా రాజకీయహత్య అంటూ సిగ్గులేకుండా చంద్రబాబు వచ్చి పరామర్శించాడని ఆరోపించారు.

కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుంటే అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు విక్టరీ సింబల్‌ రెండువేళ్లు చూపించాడంటే ఎంత దారుణం అన్నారు. కోడెల మృతదేహంముందు సంతోషంతో ఉన్నట్లు తెలుగురాష్ట్రాలలో ప్రచారం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ నీతినిజాయితీ ముందు చంద్రబాబు సరిపోడన్నారు. చాలామంది టిడిపిని వదిలివేసి క్యూలో నిల్చున్నారని, వెళ్లిపోవడానికి సిధ్దంగా ఉన్నారని అన్నారు.

నాగార్జునరెడ్డిపై దాడి కేసులో దాడిజరిగిన 12 గంటలలోనే ఆరుగురుని అరెస్ట్‌ చేశారని, వెహికల్‌ ను కూడా సీజ్‌ చేశారని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆయన వర్గీయుల చేతిలో శంకరయ్య అనే ఆంధ్రప్రభ రిపోర్టర్‌ ను చంపితే ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదని అన్నారు. నాగార్జునరెడ్డిపై దాడిని తాను కూడా ఖండిస్తున్నట్లు చెప్పారు. వాటిని సమర్దించేవాళ్లం కాదన్నారు. దాడివేరు. జర్నలిజానికి ఆపాదించడం సరికాదన్నారు.

గత మూడు రోజులుగా నాగార్జునరెడ్డికి ఎవరూ కూడా మధ్దతు తెలియచేయలేదన్నారు. చంద్రబాబు రాజకీయంగా చచ్చిపోయాడనే ఆనందంలో ప్రజలు ఉన్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా అదే భావనలో ఉంటారని, చంద్రబాబుపై సానుభూతి లేదన్నారు. అక్రమకట్టడంలో నివాసం ఉంటూ రివర్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ గురించి నీకు తెలియదా? అని ప్రశ్నించారు.