Home విద్య విద్యార్థి దశ నుండే ఆరోగ్యంపై అవగాహన ఉండాలి : కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్...

విద్యార్థి దశ నుండే ఆరోగ్యంపై అవగాహన ఉండాలి : కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి

503
0

చీరాల : ఆల్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ టిప్పులో భాగంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ను శుక్రవారం సందర్సించారు. హాస్పిటల్ నందు స్టెతస్కోప్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎముకులు విరిగినపుడు ఎక్స్రే ఎలా తీస్తారు, ఎక్స్ రేని ఎలా చూస్తారు, ఐసియు, ఆపరేషన్ థియేటర్, రక్త పరీక్షల ల్యాబ్, జనరల్ వార్డు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, క్యాజువాలిటీని సందర్శించారు.

ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చిన్నప్పటి నుండే హాస్పిటల్స్ అందించు వైద్యసేవలు మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఎముకల వ్యాధులకు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, కడుపు సంబంధించిన జనరల్ ఆపరేషన్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడునని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ పిటి నాగరాజు, టీచర్స్ పాల్గొన్నారు.