Home విద్య ఆల్ట‌స్ విద్యార్ధుల ఆల‌యాల సంద‌ర్శ‌న యాత్ర‌

ఆల్ట‌స్ విద్యార్ధుల ఆల‌యాల సంద‌ర్శ‌న యాత్ర‌

826
0

చీరాల : చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవ‌ర‌ణ‌లోని ఆల్ట‌స్‌ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రల్లో భాగంగా ప‌ట్ట‌ణంలోని వివిధ మ‌తాల ఆల‌యాలను మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. ప్ర‌తినెలా ఏదో ఒక కొత్త ప్ర‌దేశానికి విద్యార్ధుల‌ను తీసుకెళ్ల‌డం పాఠ‌శాల స‌మ‌య‌పాల‌న‌లో భాగ‌మైంది. అందులో భాగంగా 1, 2వ తరగతి విద్యార్థులు రామాలయం, చర్చి, మసీదులను సందర్శించారు. పూజారి చ‌దివి వినిపించిన ప్ర‌వ‌చ‌నాల‌ను రమాలయలో విద్యార్ధులు శ్ర‌ద్ద‌గా విన్నారు.

చర్చిసెంటర్లోని సెయింట్ మర్క్స్ లూధరన్ చర్చను సందర్శించి ప్రార్ధనల అనంత‌రం బైబిల్ పఠనం తెలుసుకున్నారు. అనంత‌రం మసీదు సెంటర్లోని ప్రముఖ పెద్ద మసీదును సందర్శించారు. అక్క‌డ‌ సర్వ మత ప్రార్ధనలు చేసారు. ఈ సందర్భంలో విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించుట, తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అన్ని మతాలు, దేవుళ్ళు ఒకటేనని, మనుషులంతా ఒకటేనని, మతాలు చెప్పే సారాంశం ఒకటేనని, ప్రజలంతా సమానమే, శాంతి, సమైక్యతతో, సోదరభావంతో, కలిసిమెలిసి అన్నదమ్ములు లాగా జీవించాలని వివిధ మ‌తాల పెద్ద‌లు, ఉపాధ్యాయులు బోధించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి కథేరేశన్, అడ్మిషన్స్ ఇంచార్జి మోహన్ చౌదరి, కంప్యూటర్ అధ్యాపకురాలు శ్రీ‌మహాలక్ష్మి, సామాన్యశాస్రం అధ్యాపకురాలు సర్వేశ్వరీ, వ్యాయమ అధ్యాపకుడు సుబ్బరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.