మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిటైర్‌మెంట్‌పై ఆ మధ్య పెద్ద చర్చే జరిగింది. తన ఆస్తులను కుమారులు ముగ్గురికీ సమానంగా పంచేసి అరవింద్ సినిమాల నుంచి రిటైర్ అవ్వబోతున్నాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే రాను రాను ఫిల్మ్ ప్రొడక్షన్ తగ్గించినా మరో కొత్త బిజినెస్‌లో బిజీ అవ్వబోతున్నాడట. ఇప్పటివరకూ నిర్మాతగా, పంపిణీదారుడిగా ఒక ఛానెల్ నిర్వాహకుడిగా వ్యవహరించిన అరవింద్ ఇప్పుడు ‘ఓ.టి.టి’ అనే సరికొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవబోతున్నారట.
‘ఓ.టి.టి.’ అంటే ఓవర్ ద టాప్ అని అర్థం. ఈ టెక్నాలజీతో కేబుల్, శాటిలైట్ అవసరం లేకుండా టి.వి.లకు హై స్పీడు ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్లు ఇచ్చి ప్రసారాలు అందజేస్తారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ విదేశాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే మన
దేశంలో ఎంటరైన ‘ఓ.టి.టి.’ టెక్నాలజీతో ఏక్తాకపూర్ వంటి నిర్మాతలు బాలీవుడ్‌లో కూడా వండర్స్ సృష్టిస్తున్నారు. నిర్మాతగా అగ్రపథంలో సాగుతోన్న అరవింద్ ‘ఓ.టి.టి’ వ్యాపారంలోనూ సత్తా చాటుతాడేమో చూడాలి మరి.