హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణను కొనసాగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో అల్లం నారాయణ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 30తో పదవీ కాలం ముగుస్తుండటంతో పడవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అందుకు సంబంధంచిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లుగా అమలు పరిచిన జర్నలిస్టుల శిక్షణా సంక్షేమ కార్యక్రమాల్ని అదే పేరుతో మీడియా అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని సీఎం కెసిఆర్ కు ఈ సందర్భంగా అల్లం నారాయణ అందజేశారు.