– కష్టపడే పేద వారికి, పేద విద్యార్థులకు అండగా ఉంటాము : తాడివలస దేవరాజు
– ప్రపంచంలో పోలియోను నిర్మూలించడానికి రోటరీ క్లబ్ చేసిన కృషి ఎనలేనిది.
– 2025 సంపూర్ణ అక్షరాస్యత రోటరీ క్లబ్ లక్ష్యం
చీరాల : 2020- 2021 రోటరీ గవర్నర్ రోటరీ క్లబ్ క్షీరపురి ఆదివారం చీరాలలో రోటరీ క్లబ్ భవనంలో జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సభకు రోటరీ క్లబ్ క్షిరపురి చీరాల అధ్యక్షుడు తాడివలస దేవరాజు అధ్యక్షత వహించారు. మొదట ప్రపంచ శాంతి కోసం మౌనం పాటించారు. క్లబ్ లోకి కొత్త సభ్యులను రోటరీ గవర్నర్ చే పిన్ చేసి ఆహ్వానించారు.
రోటరీ సేవా కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యాన్ని ఎదిరించి కష్టపడుతున్న కనకరావుకు రూ.30వేల విలువచేసే ఎయిర్ కంప్రెసర్ మిషన్ ను శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున, శ్రీమతి శివకుమారికి స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్ ను నన్నపనేని రామకృష్ణ తరపున రోటరీ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు.
రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ 6అంశాల మీద రోటరీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉన్నదన్నారు. బేసిక్ ఎడ్యుకేషన్, తల్లి, బిడ్డ ఆరోగ్యం, ఆరోగ్యము మరియు పరిశుభ్రత, వాటర్ అండ్ శానిటేషన్, పేద వారికి ఆర్థిక చేయూత, ప్రపంచ శాంతి వంటివని చెప్పారు. రోటరీ క్లబ్ లో ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులని అన్నారు. చీరాల ప్రజలకు విద్య రంగంలో, సామాజిక అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని గవర్నర్ హనుమంతరెడ్డి తెలిపారు.
రోటరీ క్లబ్ క్షిరపురి అధ్యక్షుడు తాడివలస దేవరాజు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా చీరాలకు మరింత సేవ చేయగలుగుతున్నామని, గవర్నర్ సమయాన్ని చీరాలలో వెచ్చించి క్లబ్ డెవలప్మెంటుకు, సమాజానికి సేవ ఎలా చేయాలని తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కష్టపడే వారికి మరింత తోడ్పాటును అందించడానికి రోటరీ క్లబ్ సహకారంతో, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున ప్రోత్సాహిస్తూ ఉంటామని అన్నారు. క్లబ్ సభ్యులు అందరినీ కలుపుకొని మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం రోటరీ గవర్నర్ ను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఆలపాటి విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణ, రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి సభ్యులు సుబ్రహ్మణ్యం, పాండురంగారావు , హనుమంతరావు, వంశి, రాఘవ, గోవిందరావు, పోద మురళి, ప్రత్యూష్య పాల్గొన్నారు.