Home ప్రకాశం ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ

389
0

చీరాల : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మహిళా మండలి, వివిధ విద్యాలయాల ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. గడియారస్థంభం కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. ర్యాలీని జెండా మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం వ్యాధిని కనుగొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మందు కనుగొనలేకపోయారని తెలిపారు. హెచ్ఐవికి నివారణ ఒక్కటే మార్గమన్నారు. కాబట్టి దీనిపై అవగాహన కలిగి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.