హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ నటుడు రాళ్లపల్లి(73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 850కిపైగా చిత్రాల్లో రాళ్లపల్లి నటించారు. ఆయన అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు. 1979లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగం ప్రవేశం చేశారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో రాళ్లపల్లి జన్మించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.